Nagababu: క్రిమినల్ కేసులు లేవు… నాగబాబు ఆస్తులు.. అప్పుల వివరాలు ఇవే!

Nagababu: జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో నాగబాబు పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే నామినేషన్ దాఖలు చేస్తూ ఈయన ఆస్తుల వివరాలను అలాగే అప్పుల గురించి కూడా అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. మరి నాగబాబు ఆస్తుల విలువ ఎంత అప్పులు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని వస్తే…

మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో మొత్తం రూ. 55.37 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన దగ్గర రూ. 21.81 లక్షల నగదు ఉండగా బ్యాంకులలో రూ. 23.53 లక్షలు డిపాజిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రూ.1.03 కోట్లు ఇతరులకు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. 67.28 లక్షల విలువైన బెంజ్ కారు, రూ. 11.04 లక్షల విలువైన హ్యుందాయ్ కారు,రూ. 18.10 లక్షల బంగారం, రూ. 16.50 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నట్టు తెలిపారు.

భార్య వద్ద రూ. 57.9 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ. 21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి ఉన్నాయని తెలిపారు. వీరిరువురికి కలిపి మొత్తం రూ. 59.12 కోట్ల చరాస్తులు ఉన్నట్లు నాగబాబు ఆఫిడవిట్లో పేర్కొన్నారు.స్థిరాస్తుల పరంగా చూస్తే, రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో రూ. 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ. 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అప్పుల విషయానికి వస్తే, రెండు బ్యాంకుల్లో రూ. 56.97 లక్షల గృహ రుణం, రూ. 7.54 లక్షల కార్ రుణం ఉన్నాయని నాగబాబు తెలిపారు. అదనంగా, ఇతర వ్యక్తుల వద్ద రూ. 1.64 కోట్ల అప్పు చేసినట్లు తెలిపారు. అదే విధంగా తనపై ఏ విధమైనటువంటి క్రిమినల్ కేసులు కూడా నమోదు కాలేదంటూ నాగబాబు అఫిడవిట్ లో పొందుపరిచారు.