Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కూడా తానులో ముక్కీనా…అలాంటి నాయకుడే అనిపించుకున్నారా?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చి ఎంతో మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి అందరూ ఆశ్చర్య వ్యక్తం చేశారు.చెగువీరా నుంచి స్పూర్తి పొంది జనసేనను స్థాపించాను అని పవన్ 2014లో చెప్పినపుడు ఆయన రాజకీయం ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా ఉంటుందని అందరూ భావించారు.

పవన్ 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కాదు ఆల్టర్నేటివ్ సెక్షన్లతో కూడిన రాజకీయాలకు తెరతీసారని భావించారు. ఇక 2019లో ఓడిపోవడంతో ఈయన అసలు రాజకీయ స్వరూపం బయటపడింది. 2020లో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. 2024లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.

అయితే గతంలో ఈ రెండు పార్టీలను తాను విమర్శించారనే విషయాన్ని పవన్ పూర్తిగా మర్చిపోయారు.. ఇలా తన పార్టీలో వారసత్వ రాజకీయాలకు చోటు ఉండవు అంటూ బహిరంగ సభలలో మాట్లాడిన పవన్ తిరిగి ఎమ్మెల్సీని తన అన్నయ్య నాగబాబుకి ఇచ్చుకున్నారు. ఇవన్నీ పక్కనపెట్టి జనసేన పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్న వారిలో పవన్ కళ్యాణ్ మినహా మిగతా ఇద్దరు కూడా సన కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే ఇచ్చారు.

ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతున్న నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే నాలుగు మంత్రి పదవులు ఒకే సామాజిక వర్గానికే కేటాయించినట్లు అవుతుంది. ఇలా ఈ విషయాలన్నీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడేనని ఈయన కూడా ఆ తానులో ముక్కే అంటూ పలువురు ఈయనపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు చేసే చేతలకు చాలా తేడా ఉందని ఈయన కూడా కపట రాజకీయ నాయకుడేనని పవన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.