Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమాలు చూస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో కెరియర్ పట్ల ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా వరుస సినిమాలో వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్న నిహారిక వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ఇదివరకే పెళ్లి చేసుకుని తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇలా నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన ఈమె తిరిగి రెండో పెళ్లి చేసుకోబోతుందని తనకు బావవరస అయిన సాయి ధరమ్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి కానీ ఈ వార్తలను నిహారిక పూర్తిగా ఖండించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
హీరోల గురించి ఈమెకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో ఉండే హీరోలలో క్రేజీ హీరో ఎవరు అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నిహారిక బన్నీ అంటూ సమాధానం చెప్పారు. బన్నీ చాలా యాక్టివ్ ఆయన ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్ చేశారు. అనంతరం యాంకర్ మరో ప్రశ్న వేస్తూ ఎవరిని తొందరగా బుట్టలో పడేయొచ్చు అంటూ కూడా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నిహారిక ఏమాత్రం ఆలోచించకుండా వైష్ణవ్ తేజ్ అంటూ సమాధానం చెప్పారు. వైష్ణవ్ ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తారని నిహారిక తెలిపారు.నాకు వాడు టెడ్డీ బేర్ లాంటోడని చెప్పి నవ్వులు పూయించింది . మొత్తంగా వైష్ణవ్‌తో తను ఎలా ఉంటుందో ఒక్క ముక్కలో చెప్పేసింది నిహారిక. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.