Chiranjeevi: పవన్ కష్టపడతాడని మా అమ్మ తెగ ఫీల్ అవుతుంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

Chiranjeevi: చిరంజీవి మహిళా దినోత్సవ సందర్భంగా తన చెల్లెలు అలాగే తన తల్లితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో భాగంగా చిరంజీవి తన తల్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మా ఇంట్లో మా అమ్మకు ఒక సపరేట్ కిచెన్ ఉందని తెలిపారు. ఎప్పుడైనా అమ్మకు మాకు ఏదైనా వంట చేయాలి అనిపిస్తే ఆ కిచెన్ లోనే మాకు నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసి పెడతారని చిరంజీవి తెలిపారు. ఇక మా కంటే కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం అమ్మ వెంటనే కిచెన్ లోకి వాలిపోతుందని చిరు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చాడంటే వాడు ఎంతగానో బయట ఎండకు గాలికి తిరుగుతూ కష్టపడి పోతున్నారని అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది.

మేమంతా ఇక్కడ గొడ్డు చాకిరీ చేసినా కానీ అమ్మ అలా ఫీల్ అవ్వదు కానీ వాడు బయట రాజకీయ పనులలో ఎండలో తిరగడం టీవీలలో ఎక్కువసార్లు చూపించడం వల్ల తాను అలసిపోయాడని అమ్మ ఫీల్ అవుతుందని చిరు తెలిపారు. అందుకే పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటే చాలు వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోయి తనకు ఎంతో ఇష్టమైన బిర్యాని వండి ఆమె తినిపిస్తుందని వెల్లడించారు.

ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారు ఏం చేస్తున్నారో అనే విషయాలు మనకు ఎవరికీ సరిగా తెలియవు కానీ కళ్యాణ్ బాబు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు అనే విషయాలు మాత్రం అమ్మకు స్పష్టంగా తెలుస్తాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన తల్లి ఇద్దరికీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.