Balakrishna: పవన్ కళ్యాణ్ నాగబాబు పై ఫైర్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్… మరీ ఇంత అన్యాయమా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన ఇటీవల సినిమా ఇండస్ట్రీలో అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం తనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే తాజాగా బాలయ్య అభిమానులు ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా బాలకృష్ణ అభిమానులు మండిపడటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే తన తండ్రి స్థాపించిన సొంత పార్టీలో బాలకృష్ణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. నాలుగు దశాబ్దాల పాటు తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేస్తున్న బాలకృష్ణకు ఇప్పటివరకు ఆ పార్టీలో మంత్రి పదవి దక్కకపోవడం గురించి అభిమానులు ఫైర్ అవుతున్నారు.

తొలిసారిగా ఎమ్మెల్యేలు అయిన వారందరూ కూడా కీలక శాఖలలో మంత్రి పదవి తీసుకొని రాజకీయాల పరంగా సక్సెస్ అందుకున్నారు అయితే బాలకృష్ణ మూడు సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు.

ఇక గత ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం గాను అలాగే ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నారు కానీ మూడుసార్లు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన బాలయ్య మాత్రం కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వీరంతా ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు ఓకే ఇక నాగబాబు అయితే ఏకంగా ఎమ్మెల్సీలు ఎన్నికయి మంత్రి పదవి అందుకోబోతున్న నేపథ్యంలోనే బాలయ్య ఫ్యాన్స్ ఆవేదనకు గురి అవుతున్నారు.

డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉండటంవల్లే నాగబాబు ఎన్నికలలో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అవుతున్నారు. అయితే బాలయ్య ఎక్కువ వెనక ఎవరూ లేకపోవడం వల్ల ఆయన ఎమ్మెల్యేగా ఉండిపోయారు ఇది నిజంగా అన్యాయం అని తన సొంత పార్టీలో బాలయ్య ఒక సాధారణ వ్యక్తి లా ఉండటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి.