Y S.Sharmila: షర్మిల వ్యవహార శైలి ఏంటో సొంత పార్టీ నేతలకు కూడా అంత చిక్కడం లేదు. ఈమె వీలైతే తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తారు లేదంటే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు తప్ప తనకంటూ ఒక ఏజెండా లేదని తన పార్టీని బలపరుచుకోవాలనే సంకల్పం తనలో ఏమాత్రం లేదని స్పష్టమవుతుంది. గత ఎన్నికలకు ముందు ఊహించని విధంగా షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
ఇలా తనకంటూ ఒక పార్టీ ఉన్న తర్వాత షర్మిల ఆ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేయాలి పార్టీ సీనియర్లతో కలిసి మెలిసిపోతూ పార్టీ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి కానీ షర్మిల మాత్రం పార్టి సీనియర్లను ఎవరు పట్టించుకోకుండా ఎంత సేపు తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూనే వచ్చారు అయితే ఈ విమర్శలని వ్యక్తిగత కారణాలవల్ల తన గురించి స్పందిస్తూ ఉన్నారని చెప్పాలి.
ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నప్పటికీ షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో ఆమె అర్థం చేసుకోవాలి. ఇక జగన్ కాకపోతే కూటమిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ వార్తలో నిలుస్తుంటారు తప్ప ఈమె తన పార్టీని బలపరుచుకోవడానికి ఎలాంటి ఎజెండాతోను ముందుకు వెళ్లడం లేదు. ఇటీవల ఉచిత బస్సు ప్రయాణం గురించి కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేశారు..
అయితే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణలో మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేశారన్న ఇంకిత జ్ఞానం కూడా షర్మిల అక్కకు లేకపోతే ఎలా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా షర్మిల మాత్రం తన రాజకీయ రూటే సపరేటు అనే విధంగా రాజకీయాలు చేస్తున్నారు ఇలాగే చేస్తే ఈమె రాజకీయాలకు కూడా దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది.