Vijayasai Reddy: న్యూ పొలిటికల్ ప్లాన్.. విజయసాయికి బీజేపీ గాలి..?

వైసీపీని వీడిన విజయసాయి రెడ్డి భవిష్యత్తు గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మళ్ళీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, ఇకపై రాజకీయాల్లో ఉండబోనని, వ్యవసాయం చేస్తానని ప్రకటించారు. అయితే తాజాగా ఆయన ఢిల్లీలో బీజేపీ కీలక నేతలతో కలిసినట్లు సమాచారం, దీని వలన ఆయన అసలు రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా? లేక కొత్త ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.

విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ, ఆయన రాజకీయం పూర్తిగా వదిలేశారని ఎవ్వరూ నమ్మడం లేదు. ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్‌ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక గౌరవం పొందడం, ఇంకా రాజకీయాల్లో అతనికి ప్రాధాన్యత ఉందని స్పష్టంగా సూచిస్తోంది. ముఖ్యంగా, బీజేపీలోకి చేరికపై ఆయన ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు పలు వర్గాల నుంచి సమాచారం వస్తోంది. జూన్ లేదా జులైలో ఆయన అధికారికంగా బీజేపీలో చేరతారని, పార్టీ వ్యూహాత్మకంగా ఆయనకు కీలక స్థానం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

విజయసాయి బీజేపీలో చేరితే, ఆయన మీడియా ప్రాబల్యాన్ని కూడా బాగా ఉపయోగించుకుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు జగన్ కు క్లోజ్ అయిన ఆయన, ఇప్పుడు జగన్‌కు ప్రత్యర్థిగా మారనున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీలో చేరితే ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌ను ప్రారంభించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాల్లో కొత్త మార్పులు రావడం ఖాయం. బీజేపీ అండతో జగన్‌ను బలహీనపరిచే వ్యూహంలో భాగంగా విజయసాయి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి జగన్‌కు ప్రతిష్టంభనగా మారగా, విజయసాయి చేరిక ఆ కూటమికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది.

భర్త,కూతురే కారణం || Senior Journalist Bharadwaj EXPOSED Singer Kalpana Incident || Telugu Rajyam