Balakrishna: 3 సార్లు ఎమ్మెల్యే….బాలయ్యకు దక్కని మంత్రి పదవి… అదే ప్రధాన కారణమా?

Balakrishna: సినీ ఇండస్ట్రిలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈయన రాజకీయాలలో కూడా తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈయన రాజకీయాలలో కూడా చాలా యాక్టివ్ గా ఉండటమే కాకుండా మంచి సక్సెస్ అందుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి 2014, 19, 24 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇలా మూడుసార్లు హ్యాట్రిక్ మెజారిటీతో విజయం సాధించిన బాలయ్యకు తప్పనిసరిగా ఏపీ క్యాబినెట్లో చోటు దక్కుతుందని అందరూ భావించారు.

బాలకృష్ణ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే చూడాలని ఉంది అంటూ అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ బాలయ్యకు మాత్రం ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదని చెప్పాలి. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది కనీసం అప్పుడైనా బాలయ్యకు మంత్రిగా బాధ్యతలను ఇస్తారా అనే విషయంపై అభిమానులు చర్చలు జరుపుతున్నారు.

ఇక బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవడం అనేది జరగని విషయం అంటూ మరికొందరు భావిస్తున్నారు బాలయ్య అడిగితే ఆయనకు మంత్రి పదవి రావడం పెద్ద కష్టమేమి కాదు కానీ బాలకృష్ణకు మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదని పలు సందర్భాలలో వెల్లడించారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు పూర్తిస్థాయిలో ఆ బాధ్యతలపైనే దృష్టి సారించి పనులను చేసుకుంటూ ముందుకు వెళ్లాలి కానీ బాలయ్యకు అంత సమయం లేదు.

ఈయన రాజకీయ నాయకుడు కంటే కూడా నటుడిగానే బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన బాలకృష్ణ ఇలా సినిమా షూటింగ్ పనులను వదులుకొని మంత్రిగా బాధ్యతలు చేపట్టాలి అంటే సాధ్యమైన పని కాదని అందుకే ఆయన మంత్రి పదవికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య వ్యవహారం చూస్తుంటే రాజకీయాల కంటే కూడా ఆయన సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.