Rashmika: నా ప్రియుడితో సినిమా చేస్తే బాగోదు… ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన రష్మిక… తప్పుకున్న నటి?

Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. ఈమె ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఇక ఈమెతోపాటు సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది బిజీ హీరోయిన్లగా మారిపోయారు అలాంటి వారిలో రుక్మిణి వసంత్ ఒకరు.

సప్త సాగరాలు దాటి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో ఫేమస్ అయ్యారు రుక్మిణి దీంతో ఈమెకు కన్నడలోనూ ఇటు తెలుగులో కూడా పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ నటించబోయే తదుపరి సినిమాలో ఈమెకు హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం.

ఇలా రుక్మిణి వసంత విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం రష్మిక మందన్న అని తెలుస్తుంది. రష్మిక మందన్న ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండ సినిమాలో రుక్మిణి నటిస్తే రష్మిక నటించవద్దు అని చెప్పడానికి గల సరైన కారణం తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతుందని తెలుస్తుంది.దిల్ రాజ్ నిర్మాణ సారధ్యంలో రవి కిషన్ కోలా డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ఇటీవల దిల్ రాజు లీక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రుక్మిణి వసంత్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించినప్పటికీ ఆమె మాత్రం నో చెప్పిందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా అవకాశం అందుకున్నారని, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఉన్నారని తెలుస్తోంది.