AP: ఏపీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే . అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి. ఇలా మహిళలు ఇకపై ప్రయాణం చేయాలి అంటే ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతున్న ఇప్పటివరకు ఈ పథకాన్ని మాత్రం అమలు చేయలేదు.
ఇదే విషయం గురించి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పలు జిల్లాల మహిళలందరూ కూడా ఉచిత బస్సు పథకం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ పథకం అమలులోకి వస్తే చంద్రబాబు నాయుడు కట్టే అమరావతిని కూడా చూసి రావచ్చు అంటూ మహిళలు ఎదురుచూస్తున్నారని ఈయన కూటమి ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు.
ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మండలిలో కూడా వైసిపి నేతలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మంత్రి సంధ్యారాణి ఉచిత బస్సు ప్రయాణం గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం అవుతుందని తెలిపారు. అయితే ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా మహిళలు ప్రయాణించాలి అంటే కుదరదని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆయా జిల్లాల వరకు మాత్రమే వర్తిస్తుందని జిల్లా దాటి మరో జిల్లాలోకి అడుగుపెడితే మహిళలు కూడా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని తాము ఎన్నికలకు ముందు కూడా ఇదే చెప్పాము అంటూ మంత్రి సంధ్యారాణి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరికీ షాక్ కి గురిచే సాయి.
ఇలా ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం గురించి వెల్లడించడంతో వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తెలంగాణ కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో ఏపీలో కూడా రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణా సౌకర్యం కల్పించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.