Pawan Kalyan: అంబంటి రాయుడు క్రికెటర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయన క్రికెట్ కి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలలోకి అడుగుపట్టారు. ఇలా రాజకీయాలలోకి వచ్చిన అంబంటి రాయుడు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అయితే అక్కడ ఎలాంటి పదవి రాకపోవడంతో ఆయన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి జనసేన పార్టీలోకి వచ్చారు.
ఇక ఎన్నికల ముందు ఈయనకు ఎక్కడో ఒకచోట ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారని ఆశించారు కానీ టికెట్ మాత్రం రాలేదు అయినప్పటికీ జనసేనకు మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. ఇక పార్టీ విజయవంతంగా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు మౌనంగా ఉన్న అంబటి రాయుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన ముఖ్యమంత్రి కావడం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ను కచ్చితంగా ముఖ్యమంత్రిని చేసి తీరుతామంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏ రాజకీయ పరిస్థితులైనా పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి తాను ప్రయత్నిస్తానని రాయుడు అన్నారు. నా ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి దాని కోసం మేం ప్రయత్నిస్తాము.
పవన్ సీఎం అవుతారు. ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవుతారు. మేము దగ్గర ఉండి చేస్తాం. దగ్గరుండి చేపిస్తాం. నేను కూడా కృషి చేస్తాను. అదేంటి అంటే అదొక సిద్ధాంతం. ఎందుకు కాకూడదు అంటూ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటివారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఎంతో అవసరం అని మరో 10 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెబుతున్నారు. పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అంటే ఎంతో మంది జనసైనికులు మాత్రం పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు.