Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల క అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన త్వరలోనే దిల్ రూబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా హోలీ పండుగను పురస్కరించుకొని మార్చి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కిరణ్ అబ్బవరం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. విశ్వకరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే కిరణ్ అబ్బవరం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన సొంత బ్యానర్ లో సినిమాలను కూడా నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల కిరణ్ నటించిన క అనే సినిమా తన సొంత బ్యానర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈయన సొంత బ్యానర్ లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుందని ఈ సినిమా ఎక్కువ కుప్పం పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుందని వెల్లడించారు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చింది దాదాపు షూటింగ్ కూడా పూర్తి అయిందని తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సగం షూటింగ్ పూర్తి చేసుకుని టీ మొత్తం క సినిమా పనులలో బిజీ అయిపోయామని అందుకే ఆలస్యం అవుతుందని తెలిపారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన కొంత ఫుటేజ్ తాను చూసానని ఇది చూసిన తర్వాత ఎందుకు నేను ఈ సినిమాలో నటించలేకపోయాను అంటూ బాధపడుతున్నానని తెలిపారు. ఈ సినిమా కథ నన్ను అంతలా ఆకట్టుకుంది అంటూ కిరణ్ అబ్బవరం ఆ సినిమా పేరు తదితర విషయాలు బయట పెట్టకుండానే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు.