వేసవిలో అధిక చెమటతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఆ సమస్యలు దూరం!

వేసవి కాలంలో ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యలలో అధిక చెమట సమస్య కూడా ఒకటి. వేసవిలో అధిక చెమటను తగ్గించడానికి, చల్లని నీటితో స్నానం చేయాల్సి ఉంటుంది. వదులైన, గాలి పీల్చే దుస్తులు ధరించడంతో పాటు తగినంత నీరు త్రాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. మసాలా, కెఫిన్ ఉన్న ఆహారాలు తగ్గించండి మరియు ఒత్తిడిని తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

ఫ్యాన్ లేదా కూలర్ ఉపయోగించడంతో పాటు చల్లని పానీయాలు త్రాగడం ద్వారా శరీరం చల్లగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వేడిలో ఎక్కువసేపు ఉండటం, శ్రమించడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. చెమటను తగ్గించడానికి యాంటీపెర్స్పిరెంట్లను ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలోవెరా జెల్ లేదా కాఫీ స్క్రబ్ వాడటం ద్వారా చర్మం చల్లబడి, చెమటను తగ్గించే అవకాశాలు ఉంటాయి.

వేసవికాలంలో ఎక్కువగా నీటి త్రాగడం ద్వారా శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. మజ్జిగ, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరం డీ హైడ్రేషన్ బారిన పడే ఛాన్స్ ఉండదు. కెఫిన్ ను పరిమితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. కారంగా ఉండే ఆహారాలను సైతం పరిమితంగా తీసుకుంటే మంచిది.

వేసవిలో అధిక చెమట సమస్యతో బాధ పడేవళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది. అధిక చెమట వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.