AP: ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే… టీడీపీ పై పేర్ని నాని హాట్ కామెంట్స్!

AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా సంచలనంగానే ఉంటాయి ఇలా ఇరువురి పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు అయితే తాజాగా వివేకానంద హత్య కేసులో భాగంగా ప్రధాన సాక్షి రంగన్న మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన మరణ విషయంపై వైఎస్ఆర్సిపి పార్టీపై టిడిపి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా వైసిపి గురించి వైసిపి నేతల గురించి టిడిపి చేస్తున్నటువంటి ఈ విమర్శల గురించి పేర్ని నాని స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన తప్పుడు హామీలన్నింటిని కూడా పూర్తిగా పక్కన పెట్టడం కోసమే ఇలాంటి విషయాలను తెరపైకి తీసుకువస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలలో ఓట్ల కోసం ఈయన ప్రజలకు తప్పుడు హామీలను ఇస్తూ మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.. హామీలకు పంగనామాలు పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేకపోయినా తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నాని తెలిపారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్‌మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదని.. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదని తెలిపారు మాజీ మంత్రి. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారని ప్రశ్నించారు.

సుగాలి ప్రీతి హత్య కేసును పట్టించుకోకుండా.. రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారని ఫైర్ అయ్యారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగా పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు వార్తలు రాస్తున్నారు. ఇలాంటి విషయాలు కాకుండా ఏపీ క్యాబినెట్లో ప్రజలకు చేయాల్సిన మంచి గురించి అలాగే ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్చలు జరిపి మంచి చేయాలి అంటూ ఈయన హితువు పలికారు.