ప్రఖ్యాత జర్నలిస్టు, ఇపుడు ప్రధాన మంత్రి మోదీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న ఎం జె అక్బర్ కు ‘మిటూ’ గబ్బు అంటుకుంది. ఇండియన్ మీడియాలో మహిళా జర్నలిస్టు లను లైంగికంగా వేధించిన ఎడిటర్ మహానుభావుల పేర్లు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి. ఈ వేధింపులకు గురయిన వాళ్లు ‘మిటూ ’ స్ఫూర్తితో ధైర్యంగా సోషల్ మీడియా ద్వారా తన ఛేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. రెండు మూడు రోజల కిందట టైమ్స్ ఆఫ ఇండియా హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ మీద ఏడుగురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదుచేశారు. దీనితో బిసిసిఎల్ యాజమాన్యం రెసిడెంట్ ఎడిటర్ కెఆర్ శ్రీనివాస్ ను సెలవు మీద పంపించింది.
ఇది జరిగి 24 గంటలు కాకముందే మరొక ప్రఖ్యాత ఎడిటర్, మొన్న మొన్నటి దాకా ఎషియన్ ఏజ్ సంపాదకుడిగా ఉండి, ఇపుడు కేంద్రంలో బిజెపి మంత్రిగా ఉన్న ఎంజె అక్బర్ మీద ఫిర్యాదులందాయి. అరుగురు మహిళలు అక్బర్ అభ్యంతరకర ప్రవర్తన మీద గురిపెట్టి ట్వీట్లు వదిలారు. అంతే, డొంకంతా కదిలింది.
ఇందులో ఒకరు ప్రియా రమణి. ఆమెగతంలో మింట్ లాంజ్ ఎడిటర్ గా ఉండేవారు.ఆమె అక్బర్ గురించి మొదట ఒక ట్వీట్ చేశారు.
I began this piece with my MJ Akbar story. Never named him because he didn’t “do” anything. Lots of women have worse stories about this predator—maybe they’ll share. #ulti https://t.co/5jVU5WHHo7
— Priya Ramani (@priyaramani) October 8, 2018
తర్వాత తన ఒక నాటి మేల్ బాస్ చేసిన గబ్బు పని నంతా ఆమె వోగ్ సైట్ లో ఒక అర్టికల్ రాసి కడిగేసింది. అందులో బాస్ ప్రవర్తన ఎలా ఉండేదో ఇలా రాసింది.
‘‘You’re an expert on obscene phone calls, texts, inappropriate compliments and not taking no for an answer. You know how to pinch, pat, rub, grab and assault. Speaking up against you still carries a heavy price that many young women cannot afford to pay. Sometimes you are inconvenienced when the stories get out and you are asked to take a time out. Often, you are quickly reinstated. Why would you need to evolve, right?’’
మహిళా జర్నలిస్టులను ఆఫీస్ లో కాకుండా లగ్జరీ హోటళ్లలో ఇంటర్వ్యూ చేయడం అక్బర్ కు అలవాటు. అక్కడొక పరుపు, మందుబాటిళ్లు తప్ప ఉద్యోగ వాతావారణమే ఉండేది కాదు. పరుపు దగ్గిర ఇంటర్వ్యూ ఏమిటో, కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే అమ్మాయిలకు అంతసులభంగా అర్థమై చచ్చేది కాదు. పెద్ద పెద్ద ఎడిటర్ల పరిస్థితి ఇాలా ఉంటుందేమో నని భ్ర మపడేవారు. తన ఇంటర్వ్యూ అను భవాన్ని ఆమె అక్బర్ పేరు పెట్టకుండా చాలా వివరంగా చెప్పింది.
The bed, a scary interview accompaniment, was already turned down for the night. Come sit here, you said at one point, gesturing to a tiny space near you. I’m fine, I replied with a strained smile. I escaped that night, you hired me, I worked for you for many months even though I swore I would never be in a room alone with you again.
ప్రియా రమణి ట్వీట్ తర్వాత మరొక ముగ్గురు మహిళు బయటకొచ్చి అక్బర్ ను అంటుకున్నారు.
OMG! He turned up at my friend’s house one night for a coffee. As a single mother with a sleeping child she told him she could neither invite him in nor go out with him. From next day he made life hell for her at their workplace https://t.co/3XRj7oWK94
— Sujata Anandan (@sujataanandan) October 8, 2018
Yes
— Priya Ramani (@priyaramani) October 8, 2018
The Wire అక్బర్ ను ఈ వ్యవహారాలమీద వాకబు చేసేందుకు ప్రయత్నించింది. ఆయన విదేశాలలో ఉన్నారని, మరొక మూడు రోజుల దాకా రారని తెలిసింది. అంతేకాదు,అక్బర్ మీద విదేశీ వ్యవహారాల శాఖలో ఏదయినా ఇంటర్నల్ ఎంక్వయిరీ జరుగుతుందా అని అక్బర్ బాస్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను కూడా అడిగారు. ఆమె జవాబు దాట వేశారని The Wire పేర్కొంది.