YS Jagan: నేతలంతా పార్టీ వీడుతున్నా తగ్గేదేలే అంటున్న జగన్… ఏమిటి ఆయన ధైర్యం?

YS Jagan: రాజకీయాలు అన్న తర్వాత ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వలసలు ఉండటం సర్వసాధారణం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి కొంతమంది కీలక నేతలు మారుతూ ఉంటారు వారి వ్యాపారాలను కాపాడుకోవడం కోసం వారి ఆస్తులను కేసుల నుంచి బయటపడటం కోసం ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారుతూ ఉంటారు. ఇవి రాజకీయాలలో సర్వసాధారణం.

ఇకపోతే గత ఎన్నికలలో వైకాపా ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో మాత్రం జగన్ ఏకంగా 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఎంతో మంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెబుతూ కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలా కొంతమంది వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వంలోకి వెళ్లడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు అలిగి కూర్చున్నారని పలుచోట్ల గొడవలు కూడా పడుతున్నారని చెప్పాలి.

ఇలా చచ్చేదాకా వైకాపా కండువా కప్పుకుంటామని చెప్పిన నేతలు అంతా కూడా ఇప్పుడు జంపింగ్ కావడం జగన్మోహన్ రెడ్డికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఇలా కీలక నేతలు అందరూ బయటకు వెళ్తున్న జగన్ మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకు వెళుతున్నారు. దీంతో ఈయన ధైర్యం ఏంటని కొందరు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో ఆయన వెంట ఒక ఎమ్మెల్యే ఎంపీ మాత్రమే ఉన్నారు అనంతరం తనకు ఆదరణ పెరుగుతూ వచ్చింది.

ఇప్పుడున్న నేతలందరూ కూడా పార్టీ వీడిన భయపడేదిలేదు అనే విధంగా ఈయన ముందుకు వెళ్తున్నారు.ఒకరు పోతే వంద మందిని తయారు చేస్తాననే నమ్మకమే జగన్ ధీమాకు కారణమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా కార్యకర్తలే ధీమాగా జగన్ తిరిగి జిల్లాల టూర్ ప్రారంభించారు. దీనికి తోడు వైయస్సార్ హయామంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కొనసాగిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా వైకాపా పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో పార్టీకి మరింత బలం తోడు అవుతుందని తెలుస్తోంది.