Revanth Reddy: పోలీసులు అడ్డుకోవడంతోనే రోడ్డుపై బైఠాయించాము: రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డెక్కి ధర్నా చేసిన సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే ఆయన ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై కూర్చొని మరి నిరసన తెలిపారు. అయితే ఈ నిరసనలు అదానీ వ్యవహారానికి సంబంధించినదనే విషయం మనకు తెలిసిందే. అదానీని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో ఎన్డీయే సర్కార్‌కు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చలో రాజ్ భవన్ చేపట్టారు.

ఇలా రోడ్డుపై నిరసనలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి వెళ్తుండగా రాజ్ భవన్ సమీపంలోనే పోలీసులు ఆయనని అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి రోడ్డుపై కూర్చొని మరి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం పై ఈయన చేసిన విమర్శలు సంచలనగా మారాయి. ఇండియాలో బిజినేస్ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని సీఎం అన్నారు. అదానీ, ప్రధాని కలిసి భారత దేశ పరువు తీసారని ఈయన తెలిపారు.

వీరిద్దరూ కలిసి ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువును తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని.. అలా చేస్తూ అదానీ కచ్చితంగా జైలుకు వెళ్తారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో తాము ఆదాని గురించి చర్చించడానికి కూడా సిద్ధమేనని ఆయన గురించి తీర్మానం చేసే పార్లమెంటుకు పంపుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ విషయం గురించి మేము రాజ్ భవన్ ముట్టడికి వెళుతున్న సమయంలోనే కూత వేట దూరంలో పోలీసులు తమని అడ్డుకున్నారు. అందుకే తాను రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయాల్సి వచ్చింది అంటూ రేవంత్ రెడ్డి అదానీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిని తప్పుపడుతూ విమర్శలు చేశారు.