ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్టులో ఉన్న తండేల్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ శివశక్తి పాట రిలీజ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్గా నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమాకి కార్తికేయ ఫేమ్ చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
నిజానికి ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది అనుకున్నా కొన్ని కారణాల వలన ఫిబ్రవరికి 7 కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఎప్పటికప్పుడు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్స్ ని పెంచే పనిలో ఉన్నారు తండేల్ నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన బుజ్జి తల్లి సాంగ్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది. ఇప్పుడు సెకండ్ సాంగ్ శివశక్తి టైటిల్ తో రాబోతుంది.
ఈ సినిమాని డిసెంబర్ 22న రిలీజ్ చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా నిర్మాతలు ప్రకటించారు. కాశీలోని దివ్య ఘాట్ లో ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ పోస్టర్లో నాగచైతన్య, సాయి పల్లవి శక్తివంతమైన శివశక్తి ఫోజుల దర్శనమిచ్చారు. అలాగే చుట్టుపక్కల జాతర వాతావరణం జనాలు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పండుగను అత్యంత వైభవంగా జరుపుకునే అనుభూతిని అందిస్తామని మేకర్స్ వాగ్దానం చేశారు. శ్రీకాకుళం సాంగ్స్కృతిక వారసత్వాన్ని పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే పాట ఇది.
సంగీతం పరంగా విజువల్స్ పరంగా అద్భుతం అనిపించేలా ఉంటుంది ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటను భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్లో చిత్రీకరించారు. ఇది ఇప్పటివరకు నాగచైతన్యకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రాక్ గా నిలిచింది. ఈ సినిమాకి శ్యామ్ దత్ సినిమా నిర్వహించగా నేషనల్ అవార్డు విన్నర్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ కాగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.