Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం..రిలీజ్ ది షిప్ అంటూ?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజుల క్రితం కాకినాడ పోర్టుకు వెళ్లి ఏకంగా సీజ్ ది షిప్ అంటూ సినిమా డైలాగులు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలి వెళ్తోందని ఈయన హుటాహుటిన సముద్రంలోకి వెళ్లి మరి ఆ షిప్ ను తీజ్ చేశారు దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఇలా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా కావడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా లెవెల్ లో సీజ్ ది షిప్ అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ కు అలాంటి అధికారాలు కూడా లేవని వాదనలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్రం పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. పవన్ చెప్పిన సీజ్ ది షిప్ డైలాగ్ కు వ్యతిరేకంగా రిలీజ్ ద షిప్ అంటూ కేంద్రం పవన్ కు ఊహించని షాక్ ఇచ్చింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి.. కాకినాడ కలెక్టర్ కు లేఖ రాసింది. అందులో ఆఫ్రికా తో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దని సూచించింది. తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది వస్తుందని పేర్కొంది.ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో జీటూజీ డీల్‌ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసింది. కాకినాడ పోర్టు నుంచి నూక బియ్యం ఎగుమతులు జరుగుతాయని వాటి నిలిపివేతతో ఒప్పందానికి దెబ్బగా వివరించింది.

ఈ విధంగా ఏపీ ప్రభుత్వానికి అలాగే కాకినాడ కలెక్టర్ కి నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ లేఖ రాయడమే కాకుండా షిప్పును రిలీజ్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైకాపా నాయకులు కార్యకర్తలు పవన్ చెప్పిన డైలాగుపై విమర్శలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఏమాత్రం అవగాహన లేకుండా సినిమా లెవెల్ లో డైలాగులు మాత్రమే చెబుతున్నారని పలువురు వైకాపా మంత్రులు కూడా ఈయన తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.