Pawan Kalyan: నాగబాబు మంత్రి పదవికి పడ్డ బ్రేకులు… షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన అన్నయ్య నాగబాబు కోసం కూడా ఓ పదవిని కేటాయించారనే చెప్పాలి. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఈయనకు టీటీడీ చైర్మన్ గా పదవి ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది నిజం కాలేదు అలాగే రాజ్యసభకు పంపిస్తారని కూడా వార్తల హల్చల్ చేసిన ఈ వార్తలను మెగా బ్రదర్ నాగబాబు కొట్టి పారేశారు.

ఈ క్రమంలోనే నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు కల్పించాలని పవన్ కళ్యాణ్ భావించడమే కాకుండా చంద్రబాబు నాయుడుతో ఈ విషయం గురించి కూడా ప్రస్తావన చేయడంతో అందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నాగబాబు మంత్రిగా ఏపీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగు మంత్ర పదవులను జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పటివరకు ఈ పార్టీలో కేవలం ముగ్గురు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే నాల్గవ మంత్రి పదవిని నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు అయితే ఈయన సంక్రాంతి పండుగ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారని ఇదివరకు వార్తలు వచ్చాయి కానీ ఇటీవల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీలో భాగంగా నాగబాబు ప్రస్తావన రావడంతో చంద్రబాబు నాయుడు ముందుగా తనకి మంత్రి పదవి ఇచ్చి అనంతరం ఎమ్మెల్సీ చేస్తానని చెప్పగా అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.

ముందుగా తన అన్నయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అనంతరం మంత్రిని చేయాలని కోరాడట. ఇప్పటివరకు రాజీనామా చేసిన వైసిపి ఎమ్మెల్సీ రాజీనామాలు మండలి ఛైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. దీంతో అవి ఆమోదం పొంది ఎన్నికల సంఘం బై ఎలక్షన్స్ ప్రకటిస్తే.. అప్పుడు అందులోంచి ఒకటి నాగబాబుకు కేటాయించే అవకాశం ఉంటుంది.

మార్చిలో మరో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనుండగా.. ఆ తర్వాత అయినా నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం రాబోతుంది దీంతో సంక్రాంతి తర్వాత నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిందని ఈయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.