అసత్య ప్రచారాలు నమ్మొద్దు.. మోక్షజ్ఞ మూవీ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా మొదలవ్వాల్సి ఉంది అయితే అనుకోని కారణాల వలన ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. నిజమైన కారణాలు మనకు తెలియదు కానీ మోక్షజ్ఞ అనారోగ్యం కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పారు బాలకృష్ణ. అయితే ఈ సినిమా ఆగిపోయిందని, మోక్షజ్ఞ అప్పుడే సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేడని, తండ్రి బలవంతం మీద సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని కొందరు అంటున్నారు.

ప్రశాంత్ మోక్షజ్ఞ సినిమాని పక్కనపెట్టి మరొక సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారని అందుకే మోక్షజ్ఞ సినిమా గురించి పట్టించుకోవటం లేదని, అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేయకుండా కథ మాత్రమే అందిస్తాను అన్నాడని డైరెక్షన్ తన శిష్యుడు చేస్తాడని బాలకృష్ణతో చెప్పడంతో బాలకృష్ణ ఫైర్ అయ్యారని మరికొందరు అంటున్నారు. ఈ సినిమా పై వస్తున్న రూమర్ల విషయంగా అటు ప్రశాంత్ వర్మ గాని ఇటు బాలకృష్ణ గాని ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

అయితే ఇప్పుడు ఈ విషయంపై ప్రశాంత్ వర్మ టీం స్పందించింది సినిమా గురించి ఆధారం లేని రూమర్స్ ఎన్నో ప్రచారం అవుతున్నాయని ఈ సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం ఏదైనా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అఫీషియల్ లేదా లెజెండ్ ప్రొడక్షన్స్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే వెల్లడిస్తామని అప్పటివరకు సినిమా పై వచ్చే ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది.

తేజస్విని నందమూరి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం షూటింగ్ ప్రారంభించబోతుంది. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సీక్వెల్ గా వస్తున్న ఆదిత్య 999 సినిమాతో తండ్రితో కలిసి మన ముందుకు రాబోతున్నట్లు స్వయంగా బాలకృష్ణ చెప్పటం విశేషం. ఆ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది