Rashmi Gowtham: మరోసారి క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మీ!

Rashmi Gowtham : బుల్లితెర పై రష్మీ పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ మరియు ఇపుడు ఎక్సట్రా జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయింది రష్మీ గౌతమ్. ఇక సినిమాల్లోను అప్పుడప్పుడు మెరిసిన టీవీ షోలతో వచ్చినంత గుర్తింపు సినిమాలతో రాలేదు. గుంటూరు టాకీస్ వంటి సినిమా లతో అందాలు అరబోసిన ఫలితం కనిపించలేదు.

ఇక లాక్ డౌన్ సమయం లో వీధి కుక్కలకు సహాయం చేస్తూ వైరల్ అయింది రష్మీ వీడియో . ఎప్పుడు సమస్యలపై స్పందించే గుణం తో జనాలలో మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా మూగ జీవుల విషయం లో రష్మీ ఎక్కువగా స్పందిస్తారు. వాటికి హాని కలిగించవద్దని చాలా వీడియోల్లో చెప్తుంటారు సామాజిక మధ్యమాల్లో.

ఇలా రష్మీ మహిళలపై, మూగ జీవుల పై జరిగే దాడులను ఖండించడంలో ముందుంటుంది. తరచూ ఇండస్ట్రీలో వినిపించే మాట క్యాస్టింగ్ కౌచ్ తమిళ ఇండస్ట్రీ ని మొన్నామధ్య క్యాస్టింగ్ కౌచ్ ఒక ఊపు ఊపింది. చాలా మంది సెలబ్రిటీలు తమకు జరిగిన సంఘటనలను పంచుకున్నారు #మీ టూ అంటూ పెద్ద ఎత్తున్న ట్రెండ్ అయింది.

అయితే ఇపుడు రష్మీ గౌతమ్ కూడా క్యాస్టింగ్ వాచ్ గురించి స్పందించింది.టాప్ పొజీషన్ కు చేరుకోవడానికి ఆమె ఖచ్చితంగా పడుకుని వుంటుందని అంటుంటారు అంటూ సాగే ఒక మీమ్ ని షేర్ చేస్తూ.. “అవును. చాలామందికి ఇలా అనడం సులభం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే అలా అనడం చాలా ఈజీ కానీ అక్కడ ఉన్నవారికి మాత్రమే ఆ బాధ తెలుస్తోంది అనే విధంగా రష్మీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.