Ambanti: వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు పై పోలీస్ కేసు నమోదు అయింది.అంబటి రాంబాబు పై గుంటూరు, పట్టాభిపురం పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. ఈ విధంగా ఈయనపై కేసు నమోదు చేయడానికి కారణం లేకపోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే కూటమి నేతల గురించి అనుచిత పోస్టులు చేస్తున్నారు వారందరిని అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక జనసేన కార్యకర్తలు టిడిపి కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ గురించి అలాగే వైకాపా నాయకుల గురించి కూడా అనుచిత పోస్టులు చేస్తున్నారు. అయితే వీటిపై ఫిర్యాదులు ఇచ్చిన కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని ఎంతోమంది వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపట్ల అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
ఇప్పటివరకు పోలీసులు వారి పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ ఈయన డిమాండ్ చేశారు అయితే పోలీసుల ఎంత చెప్తున్నా ఈయన వినకపోవడంతో ఏకంగా పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఈయనపై కేసు నమోదు చేశారు.
అదేరోజు ద్రౌపతి ముర్ము ఏపీకి వస్తున్న నేపథ్యంలో పోలీస్ భారీ బందోబస్తు నిర్వహిస్తున్న తరుణంలో తమ విధులకు ఆటంకం కలిగించకూడదని పోలీసులు ఈయనని ఎంతో రిక్వెస్ట్ చేసినప్పటికీ ఈయన మాత్రం ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితులలో ఈయనపై కేసు నమోదు చేశారు. ఇలా తన పట్ల కేసు నమోదు చేయడంతో అంబంటి రాంబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తాము ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకోరు అంటూ మండిపడ్డారు. ఇలా తనపై కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు ఆయనకు నచ్చ చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అంబటి రాంబాబు పై కేసు నమోదు
టీడీపీ, జనసేన సోషల్ మీడియా పై ఫిర్యాదు చేసి.. ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ నిన్న పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగిన అంబటి రాంబాబు.
పోలీసుల విధులకు అంటకం కలిగించారని అంబటి రాంబాబు పై ఇవాళ కేసు నమోదు చేసిన గుంటూరు,… pic.twitter.com/TCA7Qk8dBJ
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2024