AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు పూర్తి అయింది. ఈ ఆరు నెలల పాలనపై ఎంతోమంది విమర్శలు కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు ఆరు నెలల పాలన పై మాజీ మంత్రి కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరి రామ జోగయ్య బహిరంగ లేఖ..రాశారు. పాలకొల్లు నియోజవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించాలంటూ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఎంపీ శ్రీనివాస్ కి ఈయన బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
తాజాగా చంద్రబాబు పాలన గురించి కూడా ఈయన లేఖ రాశారు. అభివృద్ధి అంటే విశ్రాంత భవనాలు నిర్మించడం పార్కులను అభివృద్ధి చేయటం పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం కాదని తెలిపారు. ఇలాంటి భవనాలను నిర్మించడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని రామ జోగయ్య వెల్లడించారు. ఇలా ప్రజాదనాన్ని మొత్తం ఒకే చోట కేంద్రీకరించి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం అంటే దానిని అభివృద్ధి అనరని ఈయన తెలిపారు.
అభివృద్ధి అంటే అందరికీ అందుబాటులో వైద్యం మురికి కాలువలు శుభ్రత, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయటం, రోడ్ల నిర్మాణం వంటివి అభివృద్ధి అని ఈయన గుర్తు చేశారు.ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని లేఖలో వెల్లడించారు. ఈ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత మాత్రం ఇందుకు చాలా భిన్నంగా ఉందని హరి రామ జోగయ్య వెల్లడించారు.నివాస పరిపాలన రాజ్య భవనాల పేరుతో కోట్ల రూపాయలు వేచించి ఖర్చు చేయడానికి పూనుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది.
ఇలా భవనాల నిర్మాణం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అభివృద్ధి కాదు అంటూ ఈయన చంద్రబాబు తీరు గురించి ఆయన పరిపాలన విధానం గురించి లేఖ రాయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.