Nagababu: ఇప్పటికే ఏపీ క్యాబినెట్లో మెగా బ్రదర్ నాగబాబుకు కూడా చోటు దక్కుతుందనే సంగతి మనకు తెలిసిందే.ఇక ఈయనకి మంత్రిగా పదవి బాధ్యతలను అప్పగించబోతున్నట్లు స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా వెల్లడించారు అయితే త్వరలోనే నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇలా నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఈయనకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఇక ఈయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న శాఖలను కూడా నాగబాబు చూసుకుంటారని తెలుస్తోంది. ఇలా పవన్ బాధ్యతలను కూడా ఈయనే తీసుకోబోతున్నట్లు సమాచారం.పవన్ కల్యాణ్ వద్ద పలు శాఖలు ఉన్నాయి. పంచాయతీరాజ్ ప్రధానమైన శాఖ. అటవీ శాఖ కూడా కీలకం.
పవన్ కల్యాణ్ తన శాఖల విషయంలో పూర్తిగా అధికారులకే వదిలేయకుండా.. తన ఆలోచనలకు తగ్గట్లుగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ తరుణంలోని అటవీ శాఖను నాగబాబుకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా అటవీశాఖతో పాటు మరొక శాఖను కూడా ఈయనకు కేటాయించబోతున్నట్లు సమాచారం.
జనసేన ఎమ్మెల్యే అయినటువంటి కందుల దుర్గేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన వద్ద ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ శాఖను కూడా నాగబాబుకు కేటాయిస్తారని చెబుతున్నారు. అటవీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబు పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇవి కాకుండా ఈయనకు ఎలాంటి శాఖ కేటాయిస్తారు వీటితో పాటు మరికొన్ని అదనపు బాధ్యతలను కూడా అప్పగించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే సంక్రాంతి తర్వాత ఈయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఇదివరకు వార్తలు వచ్చాయి కానీ ఏప్రిల్ వరకు నాగబాబు మంత్రిగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది.