Kavitha: కవిత పొలిటికల్ రీఎంట్రీ… అక్కడి నుంచే పోటీకి దిగుతారా… కాంగ్రెస్ పాలైన కవిత కష్టం?

Kavitha: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల తన పొలిటికల్ రీ ఎంట్రీ ప్రారంభించారని తెలుస్తుంది. ఈమె లిక్కర్ కేసు ఘటనలో భాగంగా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా కొన్ని నెలల పాటు జైలులో ఉన్న కవిత తిరిగి జైలు నుంచి బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చిన ఈమె కొన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుతం మాత్రం తిరిగి రాజకీయాల పరంగా ఎంతో యాక్టివ్ అయ్యారు. జగిత్యాల నుంచి పొలిటికల్‌ జైత్రయాత్ర మొదలుపెట్టిన కవితకు పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ కూడా చేశారు.

జగిత్యాల నుంచి వచ్చే ఎన్నికలలో పోటీకి ఈమె సిద్ధం కావడంతోనే ఇప్పటినుంచి అక్కడ పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక గతంలో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే ఈ ప్రచార కార్యక్రమాలలో కవిత తానే పోటీ చేస్తున్నట్టుగా ఇంటింటికి వెళ్లి మరి ప్రచారం చేసి సంజయ్ ను గెలిపించారు. ఇలా సంజయ్ భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ తో కలిసి పోయారు.

ఈ విధంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన సంజయ్ కి బుద్ధి చెప్పడం కోసమే కవిత జగిత్యాలను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సంజయ్ గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి మరీ ప్రచారం చేసి ఎంతో కష్టపడినా కవిత కష్టం కాంగ్రెస్ పాలు అయిందని చెప్పాలి. ఎలాగైనా వచ్చే ఎన్నికలలో ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే అక్కడి నుంచే రీ ఎంట్రీ ప్లాన్ చేశారనేది పొలిటికల్‌ టాక్.. ఐతే ఈసారి జగిత్యాల అభ్యర్థిగా కవిత ఉంటారా.. లేదంటే పార్టీ కోసమే ప్రచారం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Kavitha Political Re - Entry | రాబోయే ఎన్నికల్లో జగిత్యాల నుంచే కవిత పోటీ? | Gossip Garage | 10TV