YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో సింగిల్ గా ఎన్నికల బరిలో దిగి ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించారు. ఇలా సింగిల్ గా పోటీ చేసి ఇన్ని స్థానాలలో విజయం సాధించిన నాయకుడిగా జగన్ సరికొత్త రికార్డులు సృష్టించారు ఇప్పటివరకు ఆ రికార్డు చెరిగిపోలేదనే చెప్పాలి ఇటీవల కూటమి నేతలు164 స్థానాలలో విజయం సాధించిన పొత్తులో భాగంగా విజయం అందుకున్నారే తప్ప సింగిల్ గా పోటీ చేసి గెలవలేదని చెప్పాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డిని వీడి కూటమినేతల వైపు చూస్తూ ఉండగా మరి కొంతమంది పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు మరోవైపు తన చెల్లి షర్మిల సైతం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తరుచూ విమర్శలు వర్షం కురిపిస్తుంది.
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది. ఈ క్రమంలోనే జగన్ తన అసలు రాజకీయం మొదలుపెట్టారని తెలుస్తోంది. ఆరు నెలల పాలనలో కూటమి ప్రభుత్వ తీరు గురించి ప్రజల ఆలోచన విధానాన్ని తెలుసుకోవడం కోసం ఈయన జిల్లాల బాట పట్టబోతున్నారు. సంక్రాంతి తర్వాత ఈయన ప్రతి నియోజకవర్గంలోనూ రెండు రోజులపాటు బస చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఏపీ కాంగ్రెస్లో తన తండ్రి హయామంలో మంత్రులుగా పనిచేసినటువంటి ఎంతోమంది సీనియర్ నాయకులను జగన్మోహన్ రెడ్డి వైకాపాలోకి ఆహ్వానించేలా పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఇటీవల కర్నూల్ ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో మాజీ మంత్రి శైలజనాథ్ ను జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు.
ఈ క్రమంలోనే ఈయన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులను కూడా వైకాపాలోకి ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది. శైలజ నాథ్ తో పాటు మరో ఎనిమిది మంది సీనియర్ నాయకులు జగన్ చెంతకు చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఏపీపీఎస్సీ అధ్యక్షరాలుగా కొనసాగుతున్న షర్మిల వ్యవహార శైలి పట్ల సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈమె ధోరణి నచ్చకపోవడంతోనే జగన్ చెంతకు చేరడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇలా ఆపరేషన్ కాంగ్రెస్ అంటూ జగన్ సరికొత్త వ్యూహం మొదలుపెట్టారు మరి ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేనా లేదా అనేది తెలియాల్సి ఉంది.