Akkineni Akhil: సీమ బ్యాక్‌డ్రాప్‌తో అఖిల్‌ కొత్త సినిమా!

కెరీర్‌లో సరైన బ్రేక్‌ ఎదురుచూస్తున్న యాక్టర్లలో ఒకరు అక్కినేని అఖిల్‌. గతేడాది సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్‌ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటివరకు నటించిన బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయకపోవడంతో.. అఖిల్‌ నెక్ట్స్‌ ఏ సినిమా ప్రకటిస్తాడా.. ? అని ఎదురుచూస్తున్న వారి కోసం కొత్త అప్‌డేట్‌ తెరపైకి వచ్చింది.

అఖిల్‌ కొత్త ప్రాజెక్ట్‌ రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ప్రేమ కథని తెలుస్తోంది. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లాంచ్‌ కూడా పూర్తయినట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎస్‌ థమన్‌ సంగీతం అందించనున్నాడు.

అంతేకాదు ఈ మూవీలో డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల అఖిల్‌కు జోడీగా కనిపించబోతుందని.. హోంబ్యానర్లపై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా తెరకెక్కించనున్నారని ఇన్‌ సైడ్‌ టాక్‌. మురళీ కిశోర్‌ అబ్బూరు వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఈ డైరెక్టర్‌ అఖిల్‌కు మంచి బ్రేక్‌ ఇస్తాడా..? అన్నది తెలియాల్సి ఉంది. అఖిల్‌ నిశ్చితార్థం జైనబ్‌ రవ్జీతో నవంబర్‌ 26న ఘనంగా జరిగింది. వీరి వెడ్డింగ్‌ వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.