Kethi Reddy: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు అయితే ఈయనకు ఉత్తరాది జిల్లాలలో ఎంతో మంచి పట్టు ఉంది. అయితే రాయలసీమలో కూడా జనసేన పార్టీకి మంచి పట్టు సాధించడం కోసం ఇప్పటికే జనసేన నేతలు రాయలసీమలోని కీలక నాయకుల పై ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇలా రాయలసీమ జిల్లాలలో ఎవరికైతే మంచి పట్టు ఉందో ఆ నాయకులను తమ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రజలలో ఎంతో మంచి ప్రాధాన్యత పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని జనసేన పార్టీలోకి చేర్చుకోవడం కోసం జనసేన నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కేతిరెడ్డి నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల అవసరాలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ప్రజా నాయకుడిగా ప్రజల మనిషిగా పేరు పొందారు.
ఇక గత ఎన్నికలలో తప్పకుండా కేతిరెడ్డికి మంచి విజయం తక్కుతుందని పార్టీ గెలిస్తే ఈయనకు మంత్రి పదవి కూడా ఖాయమని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా కేతిరెడ్డి కూడా ఓడిపోవాల్సి రావడంతో ఆయన కొంత కాలం పాటు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఒకానొక సమయంలో వైకాపా తీరుపై విమర్శలు కూడా చేశారు.
ఇలాంటి తరుణంలోనే ఈయనని తమ వైపుకు తిప్పుకోవడం కోసం జనసేన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిసిన కొంతమంది జనసేన నేతలు ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారట జనసేన పార్టీ కండువా కప్పుకోవాలని పార్టీలోకి రాగానే ఆయనకు పదవులు కూడా ఇస్తామని ఆశ చూపించారట కానీ కేతిరెడ్డి మాత్రం తాను జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిని జగనన్నను వదిలి బయటకు రాలేనని, పదవులకు ఆశపడే వ్యక్తిని తాను కాదు అంటూ ఈయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. ఇలా తమ పార్టీలోకి రావాలనీ జనసేన నేతలు ఈయనకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేతిరెడ్డి మాత్రం ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.