తమిళ దిగ్గజ హాస్య నటుడు చంద్రబాబు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గోపాల్ వర్మ స్టూడియోస్ సిద్ధపడింది. తమిళ రచయిత దర్శకుడు కే రాజేశ్వర్ సినిమా రంగంలో అత్యధిక పారితోషకం అందుకున్నటుడిగా ప్రత్యేకమైన నటనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు జీవితాన్ని వెండితెరపై తీసుకురావాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. నాటి రోజుల్లో హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషకం అందుకున్న తమిళ కమెడియన్గా జేపీ చంద్రబాబుకి మంచి గుర్తింపు ఉంది.
అతడు కథ బయోపిక్ మెటీరియల్ అన్న ప్రచారం సాగుతోంది ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవలని దర్శకుడు, రచయిత అయిన కే రాజేశ్వర్ రాశారు. ఆ కథని సినిమాగా తీయాలని ఉద్దేశంతో నటుడు చంద్రబాబు సోదరుడు జవహర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు ఈ సంస్థ నిర్వాహకులు. అయితే ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
చంద్రబాబు పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారని అక్కడ ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే ఎప్పటికీ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న ధనుష్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తానే టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం కూడా తానే వహిస్తున్న సినిమా ఇళయరాజా బయోపిక్ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తర్వాత చంద్రబాబు బయోపిక్ కి కూడా దర్శకత్వ వహించే అవకాశం ఉందని ప్రచారాలు జరుగుతున్నాయి.
చంద్రబాబు పాత్రలో ధనుష్ కనిపిస్తే ప్రేక్షకులకు ఆసక్తికర అనుభవం కలిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కోలీవుడ్ కమెడియన్ చంద్రబాబు విషయానికి వస్తే ఆయన గాయకుడిగా హాస్యనటుడిగా విభిన్న పాత్రలలో తన ప్రతిభను చాటుకున్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆయన జీవిత కథపై రూపొందించే ఈ బయోపిక్ ప్రేక్షకులకు అందించడమే కాకుండా ఆయన గొప్పతనాన్ని కొత్త తరానికి పరిచయం చేయటం అనేది అభినందించదగ్గ విషయం