Janasena: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున శృతిమించి వ్యవహరిస్తున్న తీరు పార్టీ నేతలకు ఊపిరాడనివ్వడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది నేతలు కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. అయితే తాజాగా జనసేన నేత ఏకంగా 50 మంది అమ్మాయిలతో అస్లీల నృత్యాలు చేస్తూ బుక్ అయినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు పబ్ కల్చర్ రేవ్ పార్టీలు అనేది మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేవి కానీ ఇప్పుడు ఇవి మారుమూల గ్రామాలకు కూడా విస్తరించాయని తెలుస్తుంది. ఇలా పబ్బులు పార్టీలు అంటూ ఎంతోమంది మద్యానికి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
జనసేన యువనేత వాకమూడి ఇంద్ర తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో భాగంగా మద్యంతో పాటు మాదిగ ద్రవ్యాలను కూడా ఉపయోగించారని తెలుస్తుంది. తన పుట్టినరోజును పురస్కరించుకొని ఇంద్ర తమ గ్రామ సమీపంలోనే ఒక మిల్లులో ఏకంగా 50 మంది అమ్మాయిలతో రేవు పార్టీ నిర్వహించారు. వారందరితో ఈయన డాన్సులు చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి దీంతో ఈయనపై జనసేన నేత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల వైసీపీ అనుకూల వ్యక్తి ఉద్యోగ సంఘాల ఎన్నికల సమయంలో మద్యం పాటు నిర్వహించినందుకు పోలీసులు తనని అరెస్టు చేశారు మరి ఇప్పుడు 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తున్నటువంటి ఈ జనసేన నేతకు కూడా చర్యలు తప్పవా, ఆయనపై చర్యలు తీసుకుంటారా లేదంటే.. తమ తప్పును కప్పిపుచ్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. కేవలం అధికారులు అధికారం అనే అండతోనే జనసైనికులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
ఏపీలో రేవ్ పార్టీ కలకలం
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో యువ నాయకుడు వాకమూడి ఇంద్ర
జన్మదినం సందర్భంగా రైస్ మిల్లులో రేవ్ పార్టీ pic.twitter.com/nEtpT06QMY— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024