పీ కే మూవీ నుంచి తప్పుకున్న స్టార్ రైటర్.. డైరెక్టర్ తో పాటే నేను అంటున్న సాయి మాధవ్ బుర్రా!

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ని ఎలా అయినా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్ మూలంగా ఈ సినిమా ఆలస్యం అయింది. ఇటీవల విజయవాడలో ఈ చిత్రానికి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా ఆలస్యం అవుతూ ఉండటం మూలంగా సినిమా నుంచి చాలామంది టెక్నీషియన్లు తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సినీ నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ మూవీని తెరకేకిస్తున్నాడు. అయితే ఈ సినిమాని ముందుగా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అతని డైరెక్షన్లో కొన్ని రోజులు షూటింగ్ జరిగిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే సడన్గా ఎందుకు తప్పుకున్నాడో తెలియదు.

ఇక తాజాగా స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ కూడా హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి మాధవ్ బుర్రా హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుతూ నేను ఈ సినిమాకి వర్క్ చేయడం లేదు డైరెక్టర్ క్రిష్ తో పాటే నేను బయటికి వచ్చేసాను. మీ అందరిలాగే నేను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను మూవీ అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు బుర్ర సాయి మాధవ్.

చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ ఆక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన యోధుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరపైకి తీసుకు వస్తారు. ఈ సినిమా మార్చ్ 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.