AP: బాబు సర్కారు తీరుపై సొంత ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న కొలికపూడి పోస్ట్!

AP: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు అవుతుంది అయితే ఈ ఆరు నెలల కాలంలో తమ పరిపాలన అద్భుతంగా ఉంది అంటూ ఇది మంచి ప్రభుత్వం అని కూటమి నేతలే చెప్పుకుంటున్నారు. అయితే ఇది మంచి ప్రభుత్వమా కాదా అనేది ప్రజలు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.

గత కొంతకాలంగా మౌనంగా ఉన్నటువంటి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ సంచలనగా మారింది. గత రెండు రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులపై ఈయన జులం విదిలిస్తున్నారు. ఇలా వైన్ షాపుల వద్దకు వెళుతూ విధులకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఈయన ఏకంగా నాలుగు బెల్టు షాపులను కూడా సీజ్ చేసేసారు.

ఇలా బెల్ట్ షాపులపై యుద్ధం ప్రకటించిన శ్రీనివాసరావు తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈయన సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కలిసి ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్లను విడుదల చేసినటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.

ఈ ఫోటోని షేర్ చేసిన కోలికపూడి తిరువూరు పట్టణంలో వినాయకుడి గుడికి ఎదురుగా, ఇంజనీరింగ్ కాలేజ్ గేటుకు ఎదురుగా, మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్టాండ్ వద్ద , మధిర రోడ్డు జనావాసాల మధ్య ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నింటినీ కూడా దయచేసి ఊరబయట నిర్వహించుకోవాలి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇలా తమ సొంత ప్రభుత్వ వ్యవహార శైలిని ఖండిస్తూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.