‘దేవర’ షూటింగ్‌లో గాయపడ్డ సైఫ్ అలీఖాన్ కోలుకుని ఇంటికి చేరాడు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం బాలీవుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జి అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి తన కారులో వెళుతూ కనిపించారు.
ఇలా గాయాలవడం, సర్జరీ వంటివి తమ వృత్తిలో భాగమని అంతకుముందు సైఫ్ పేర్కొన్నారు. అద్భుతమైన శస్త్రచికిత్స నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరగడం పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తనపై ప్రేమ కురిపిస్తున్న శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలని అన్నారు.
ఇక హైదరాబాద్‌లో ‘దేవర’ షూటింగ్ చిత్రీకరణ సమయంలో సైఫ్ అలీఖాన్ భుజానికి గాయమైంది. దీంతో సైఫ్ అలీఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరాడు.