ప్రస్తుతం గోవాలో 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఉత్సవాలలో పాల్గొన్న చాలామంది నటులు గత సినిమాల గత జ్ఞాపకాలని, తమ అనుభవాలను తోటి నటీనటులతో పంచుకుంటున్నారు. ఆ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్ తన తాత రాజ్ కుమార్ గురించి, నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జీవితంపై తీయబోయే డాక్యుమెంటరీ గురించి మాట్లాడారు.
ఇప్పుడు తాజాగా మాధవన్ తాను పాతికేళ్ల క్రితం నటించిన సినిమా రెహనా హే తేరే దిల్ మే సినిమా గురించి మాట్లాడారు. తన చిత్రం హిసాబ్ బరాబర్ ప్రీమియర్ కోసం ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన నటుడు మాధవన్ తన ఐకానిక్ మూవీ రెహనా హే తేరే దిల్ మే గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 2001లో విడుదలైంది ఈ సినిమాతోనే హీరో మాధవన్ హీరోయిన్ దియా మీర్జా బాలీవుడ్ కి పరిచయమయ్యారు.
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ఒక కీలక పాత్ర పోషించాడు. తమిళంలో విడుదలైన మిన్నాలే సినిమాకి రీమేక్ ఈ రెహనా హే తేరే దిల్ మే సినిమా. ఈ సినిమా విడుదలైన సమయంలో ఆ సినిమా హిట్ అవ్వాలని ఎంతోమంది దేవుళ్ళని మొక్కుకున్నాను. అయినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవ్వటంతో మనోవేదనకు లోనయ్యాను సినిమా హిట్ అవ్వాలంటే అదృష్టం కూడా ఉండాలని తెలుసుకున్నాను.
పాతిక సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ సినిమా రిలీజ్ అవ్వటం, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ వసూలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగించింది అని చెప్పుకొచ్చాడు మాధవన్. ఇక మాధవన్ లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ అదృష్టశాలి చిత్రీకరణ ఈమధ్యే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.ఈ ఫాంటసీ డ్రామా స్కాట్లాండ్ అంతటా ఫోర్త్ బ్రిడ్జ్, ఎడిన్ బర్గ్ మరియు డీన్ విలేజ్ తో సహా అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించబడింది. ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మాధవన్ ఫ్యాన్స్.