Allu Arjun: మరో టాలీవుడ్ దర్శకుడితో ఐకాన్ స్టార్.. సెట్టయ్యేనా?

సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. మూడు సంవత్సరాలకు పైగా తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్ కోసం కష్టపడి, బ్లాక్‌బస్టర్ విజయంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకొని, ఈ ఏడాది త్రివిక్రమ్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే, పుష్ప 2 ద్వారా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందిన అల్లు అర్జున్‌పై అక్కడి దర్శకుల నుంచి కూడా ఆసక్తి పెరిగింది.

తాజాగా, టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్‌ను కలిసి ఓ కథనంపై చర్చలు జరిపినట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ, అనేక కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు కొరటాల శివ తన ఐడియాను పూర్తిగా స్క్రిప్ట్ రూపంలో తయారు చేసి తిరిగి వినిపించాలని అల్లు అర్జున్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం అవ్వకపోయినా, కొరటాల శివ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు.

కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర 2 స్క్రిప్ట్‌పై దృష్టి పెట్టినప్పటికీ, ఆలస్యం జరిగితే అల్లు అర్జున్‌తో సినిమా తీసే అవకాశాలున్నాయి. మరోవైపు, ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నాడు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్, నెల్సన్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌ లైన్ లో ఉంది. ఇక ఈ నేపథ్యంలో దేవర 2 తీయడానికి సమయం పడితే, కొరటాల శివ ఈ బ్రేక్‌ను ఉపయోగించి అల్లు అర్జున్‌తో తన కల నెరవేర్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశ్రమవర్గాలు. మరోవైపు బన్నీ త్రివిక్రమ్ – సందీప్ వంగా లను లైన్ లో పెట్టాడు. మరి కొరటాలకు బన్నీతో చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.