Varma: పవన్ కళ్యాణ్ ఫోటోతో నాగబాబుకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ… ప్రజలే నా బలం అంటూ!

Varma: పిఠాపురం మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను క్రమక్రమంగా పిఠాపురం రాజకీయాలకు దూరం చేస్తున్నారా అంటే అవుననే తెలుస్తుంది. ఇటీవల పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగడంతో తప్పనిసరిగా వర్మ తన టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది తనకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిన నేపథ్యంలోనే తన టికెట్ వదులుకోవడంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఇక పవన్ కళ్యాణ్ గెలుపులు కచ్చితంగా వర్మ ప్రమేయం ఉందనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భాగంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ పరోక్షంగా వర్మను టార్గెట్ చేస్తూ ఈయన మాట్లాడారు. దీంతో మరోసారి వర్మ వర్సెస్ పవన్ అనే విధంగా పిఠాపురంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి.

ఇలా నాగబాబు పిఠాపురం వర్మను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన కూడా నాగబాబుకు ఊహించని విధంగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వర్మ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో పాటు చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఫోటోలతో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ ప్రజలే నా బలం అని క్యాప్షన్ ఇచ్చారు.

ఇక ఈ పోస్టర్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే వర్మ ఈ పోస్టు ద్వారా నాగబాబుకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారని భావిస్తున్నారు.గతంలో ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మకు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ పొత్తుల్లో భాగంగా కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించినా.. టీడీపీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా వర్మ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలే నా బలం అంటూ ఈయన పోస్ట్ చేశారు.