AP: పవన్ కళ్యాణ్ చంద్రబాబు నవ్వులపై ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్… చాలా సంతోషంగా ఉందంటూ!

AP: కూటమి సర్కార్ ఇటీవల విజయవాడలోని కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి నేతలందరూ కూడా పాల్గొని సందడి చేశారు. అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డ్రామాలు వేస్తూ అందరిని పెద్ద ఎత్తున నవ్వించారు.

ఇక ఈ కల్చరల్ ప్రోగ్రామ్ లో భాగంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతో ఎంజాయ్ చేస్తూ గడిపారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్ గురించి పరోక్షంగా వేసే సెటైర్లకు ఎంతో పగలబడి నవ్వుతూ కనిపించారు.

ఇలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా నవ్వుతుండడంతో వీరి సంతోషం గురించి ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నాగబాబు స్పందిస్తూ…ఆ రోజు శాసన సభలో రెస్పెక్టెడ్ సీఎం చంద్రబాబుకు జరిగిన ఇన్సల్ట్‌కు ఆయన కన్నీరు పెట్టటం ఎంత బాధించిందో.. ఈరోజు అదే శాసన సభలో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్‌లో ఆయన మనస్పూర్తిగా నవ్వుతున్న దృశ్యం అంత ప్లెజెంట్‌గా అనిపించింది.

అదేవిధంగా ఇన్ని రోజులు వర్క్ ప్రెషర్‌లో చాలా రోజులుగా నేను గమనిస్తున్న రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా నవ్విన నవ్వు చూసి నాకు చాలా సంతోషం వేసింది అంటూ నాగబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నవ్వులపై చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇటీవల నాగబాబు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలోనే ఈయన ప్రమాణ స్వీకారం చేసి అనంతరం మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారనే సంగతి తెలిసిందే.