Y.S.Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇలా ప్రధానమంత్రికి మాజీ ముఖ్యమంత్రి లేఖ రాయడానికి గల కారణమేంటనే విషయానికి వస్తే..1971 నుంచి 2011 మధ్య 40 సంవత్సరాల కాలంలో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల కాలంలో ఈ వాటా మరింత తగ్గింది. దీనికి కారణం. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపును దక్షిణాది రాష్ట్రాలు చిత్తశుద్ధితో అమలు చేశారు.
ఇలా జనాభా నియంత్రణకు పిలుపునివ్వడంతో గత 15 సంవత్సరాల కాలంలో దక్షిణాది రాష్ట్రాలలో పూర్తిస్థాయిలో జనాభా తగ్గిపోయింది. ఇక వచ్చే ఏడాది జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పున:ర్విభజన ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది.
జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలి. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరియైన భాగస్వామ్యం ఉంటుంది.అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటానని ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.