Betting App: బెట్టింగ్ యాప్ ప్రమోషన్… బాలకృష్ణ ప్రభాస్ గోపీచంద్ పై ఫిర్యాదు… ఏం జరిగిందంటే?

Betting App: రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే .ఇలా ఎంతోమంది యూట్యూబర్లు సినిమా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది అమాయకులు దీనికి బానిస అవుతూ వారి జీవితాలని కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వాటిని ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

ఎంతో మంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరి కొంతమంది సెలబ్రిటీలు ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేసి ఉంటారు వారికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వీరిపై చర్యలు తీసుకోగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్లు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయారు. ఇలా వారిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు కూడా ఉండటం విశేషం. ఈ క్రమంలోనే ప్రభాస్ , గోపీచంద్, బాలకృష్ణపై ఫిర్యాదులు వెళ్లాయి.

రామారావు అనే వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు ఈ ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు హీరోలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇలా వీరు చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కారణంగా ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్నారని ప్రభాస్ గోపీచంద్ బాలయ్య పై ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. అయితే బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా బాలయ్య బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారు అయితే ఆ ఎపిసోడ్లో ప్రభాస్ గోపీచంద్ కూడా పాల్గొనడం విశేషం.

ఇలా ఈ ఎపిసోడ్లో బాలయ్య చేసిన ప్రమోషన్స్ లో భాగంగా నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడి పెద్ద ఎత్తున డబ్బును కోల్పోయారు. ఏకంగా 80 లక్షల రూపాయల డబ్బును తాను కోల్పోయాను అంటూ ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ గోపీచంద్ బాలయ్య పై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదులు వచ్చాయి.