Posani: ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చిన పోసాని… వారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటుడు!

Posani: సినీ నటుడు పోసాని కృష్ణమురళి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కూటమి నేతలపై గతంలో విమర్శలు చేయడంతో ఈయనపై రాష్ట్రంలో సుమారు 18 చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే తనని అరెస్టు చేసి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిప్పుతూ ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న లెక్కచేయకుండా పోసానిని ఒకచోట నుంచి మరొక జైలుకు మారుస్తూ ఇబ్బందులకు గురి చేశారు.

ఒక కేసులో ఆయనకు బెయిల్ రావడమే ఆలస్యం మరొక కేసు పెట్టి తనని అక్కడ స్టేషన్ కి తరలించారు ఇలా సుమారు 24 రోజుల పాటు పోసాని కృష్ణమురళిని రాష్ట్రమంతా తిప్పుతూ ఇలా కూడా ఒక మనిషిపై కక్ష తీర్చుకుంటారా అని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఇలా ఎన్నో చిత్రహింసల తర్వాత పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేశారు.

ఇక ఈయన బెయిల్ మీద జైలు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది వైసిపి నాయకులు ఆయనకు స్వాగతం పలకడం కోసం జైలు వద్దకు వెళ్లారు. ఇలా పోసాని బయటకు రావడంతో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పోసాని గుంటూరు జైలు నుంచి బయటకు రావడంతో వైసిపి మాజీ మంత్రి అంబంటి రాంబాబు ఆయనని కలిశారు. ఇలా జైలు ఆవరణంలో అంబటి రాంబాబుని చూసిన పోసాని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక పోసాని కృష్ణ మురళికి షరుతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో ఆయన మీడియాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. గతంలో నంది అవార్డుల గురించి అలాగే కూటమి నేతల గురించి ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై కేసులు నమోదు కావడంతో పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరి అరెస్టు చేసి తొలత అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి పలు కేసులలో భాగంగా రాష్ట్రమంతా ఈయనని తిప్పుతూ ఇబ్బందులకు గురి చేశారు.