Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటన చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఫారం పాండ్‌లను ప్రారంభించిన పవన్ కల్యాణ్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఓర్వకల్లు మండలం పూడిచర్లలో పంట కుంట నిర్మాణ పనులకు పవన్ భూమి పూజ చేశారు. రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు ఎప్పుడూ పరితపిస్తుంటారని తెలిపారు.
రైతుల సంక్షేమం రైతుల అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతుల జీవితాలలో వెలుగులు నింపడం కోసం పరితపిస్తున్నామని ఈయన వెల్లడించారు. ప్రస్తుతం దేశం మొత్తం ఏపీ అభివృద్ధి వైపే చూస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆయన… గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ ఉపాధిగా మార్చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయామంలో అన్ని వ్యవస్థలను తిరిగి ఘాడిలో పెడుతూ పటిష్టం చేస్తున్నామని తెలిపారు.రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పంట కుంటల నిర్మాణం చేపడుతున్నామని పవన్ వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయాన్ని కూడా ప్రకటించారు. నందికొట్కూరు జిల్లాలో ఉన్నటువంటి కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ గ్రామ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలియజేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంటిపేరు కూడా ఇది కావడంతో తన ఇంటి పేరుకు ఈ ఊరికి ఏ మాత్రం సంబంధం లేదని కూడా తెలిపారు.