Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప సినిమాతో భారీగా పెరిగిపోయిందని చెప్పాలి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇటీవల పుష్ప2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ పెద్ద ఎత్తున వివాదంలో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదల సమయంలో తొక్కిసులాట జరిగి అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ ఏకంగా అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చారు అయితే ఈయన ఒక రోజు రాత్రి జైలుకు వెళ్లడంతో ఈయనకు ఊహించని విధంగా పాపులారిటీ వచ్చిందని చెప్పాలి. ఇలా అల్లు అర్జున్ అరెస్టుతో ఈయన పేరు నేషనల్ వైడ్ మారుమోగిపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.
ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు కానీ ఈ సినిమా మరికాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్ర అభినయంలో నటించబోతున్నారని ఒక పాత్ర పాజిటివ్ కాక మరొక పాత్ర నెగిటివ్గా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త కూడా వైరల్ అవుతుంది .ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి వార్తలు హల్చల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. రెమ్యూనరేషన్ కాకుండా సినిమా లాభాలలో 15% వాటా కూడా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా కోసం బన్నీ తీసుకునే రెమ్యూనరేషన్ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.