Tollywood: వారసుడి కోసం భార్యను టార్చర్ చేసిన టాలీవుడ్ హీరో…. ఎవరంటే?

Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం ఒక సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే కాదు వివిధ రంగాలలో కూడా తప్పనిసరిగా వారసత్వం అనేది కొనసాగుతుంది అయితే సినీ ఇండస్ట్రీలో ఇది కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.. ఈ క్రమంలోనే తమ సినీ వారసత్వం నిలబడాలి అంటే తప్పనిసరిగా తమకు అబ్బాయి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు..

ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సైతం అబ్బాయి కావాలని కోరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమకు ఒక అమ్మాయి ఉందని అందుకే అబ్బాయి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చిరంజీవి కూడా ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు ఇప్పటికే తన ఇల్లు మొత్తం మనవరాళ్ళతో నిండిపోయిందని తనకు వారసుడు కావాలి అంటూ ఎప్పుడూ చరణ్ ను అడుగుతూ ఉంటానని ఒక సందర్భంలో వెల్లడించారు .

ఇలా సినీ వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఒక స్టార్ హీరో తన భార్యను పెద్ద ఎత్తున టార్చర్ చేశారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి వారసుడి కోసం భార్యను టార్చర్ చేసిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు నటుడు మంచు విష్ణు అని తెలుస్తుంది. మంచు విష్ణుకి ఇప్పటికే నలుగురు సంతానం అనే సంగతి తెలిసిందే. మంచు విష్ణు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ వీరోనికా రెడ్డిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ఇలా పెళ్లయిన కొద్ది రోజులకు ఈ జంట కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు అనంతరం మరొక అబ్బాయికి జన్మనిచ్చారు. ఇకపోతే మరోసారి కూడా మంచు విష్ణు మరొక అమ్మాయికి తండ్రి అయ్యారు. ఇలా నలుగురు పిల్లలకు తల్లిదండ్రులుగా మంచు విష్ణు మారిపోయారు. అయితే మొదట ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఈయన తనకు కొడుకు కావాలని తన భార్యకు చెప్పారట అయితే కొడుకు పుట్టినప్పటికీ మరో వారసుడు కావాలన్న ఉద్దేశంతో టార్చర్ పెట్టారని కానీ మరి కూతురు పుట్టడంతో వారసుడి కోసం విష్ణు ఎదురు చూస్తూ తన భార్యకు టార్చర్ పెట్టగా ఆమె కూడా ఒకానొక సమయంలో విసుగు చెల్లిందని తెలుస్తుంది.

నీకు పిల్లలు కావాలంటే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకో నన్ను వదిలే అంటూ తన భార్య విష్ణుకి గట్టి సమాధానం ఇచ్చినట్లు స్వయంగా విష్ణు ఒక సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మంచు విష్ణు త్వరలోనే కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.