Pooja Hedge: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి పూజా హెగ్డే ఒకరు ఒకానొక సమయంలో ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు. ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న పూజ హెగ్డే కు ఊహించని విధంగా ఆమె నటించిన సినిమాలు షాక్ ఇచ్చాయి పూజ హెగ్డే ఏ సినిమాలో చేసిన వరుసగా ఆ సినిమాలో ఫ్లాప్ అవుతూ రావడంతో ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.
స్టార్ హీరోల సినిమాలలో పూజా హెగ్డే నటించినప్పటికీ కూడా ఆ సినిమాలో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను తీసుకురావడంతో ఈమెకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఇలా అవకాశాలు లేక కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే తిరిగి పూజ హెగ్డే కెరియర్ పరంగా బిజీగా మారుతున్నారు హిందీతో పాటు తెలుగు సినిమాలకు కూడా కమిట్ అవుతూ సుమారు అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇలా తిరిగి సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఇందులో భాగంగా సినిమాలలో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత గురించి మాట్లాడారు. ఒక సినిమా సక్సెస్ అవుతుంది అంటే కేవలం హీరో వల్ల మాత్రమే సినిమా సక్సెస్ కాదు ఆ సినిమాలో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తేనే సినిమా సక్సెస్ అవుతుందని తెలిపారు.
ఎప్పటినుంచో సినిమా అంటే హీరో హీరోయిన్ల పట్ల ఎంతో వివక్షత ఉంటుంది కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ లోకేషన్ లో కూడా హీరో హీరోయిన్ల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. హీరో కారవాన్ సినిమా షూటింగ్ లోకేషన్ కు దగ్గరనే ఉంటుంది. కానీ హీరోయిన్ల కారవాన్ మాత్రం ఎక్కడో తీసుకెళ్లి పెడతారు. మేము ఎంతో బరువైన దుస్తులను ధరించి అక్కడి వరకు వెళ్లాలి ఇలా పాత్రల కోసం మేము ఎంతో కష్టపడతాం కానీ పోస్టర్లపై మాత్రం మా పేర్లు ఉండవు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.