Nagababu: జనసేన పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ పార్టీ విజయం అందుకోవడానికి తన తమ్ముడి విజయానికి ఎంతగానో దోహదం చేసిన నాగబాబు ఎట్టకేలకు మంత్రి కాబోతున్నారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలలో నాగబాబు పోటీ చేశారు అయితే ఈయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యారు. ఇక త్వరలోనే క్యాబినెట్లోకి కూడా అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.
ఇలా నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకోవడంతో ఈయనపై మరిన్ని బరువు బాధ్యతలు పెరిగాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు మరిన్ని బాధ్యతలు అప్పచెప్పారని తెలుస్తోంది.పవన్ సూచన మేరకు నిన్న పారిశుధ్య కార్మికులను సన్మానించారు. పవన్ కళ్యాణ్ సూచనల ప్రకారం ఇకపై ఈయన పిఠాపురంలోనే ఉండబోతున్నారని పిఠాపురం కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూనే జనసైనికులకు నిరంతరం అందుబాటులో ఉండబోతున్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో పవన్ రాష్ట్రమంతా పర్యటించాల్సి వస్తుంది. దీంతో పిఠాపురానికి ఆయన పెద్దగా సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే నాగబాబుకు ఇకపై ఆ బాధ్యతలన్నీ అప్పగించినట్టు తెలుస్తుంది. ఇదివరకు పార్టీ కార్యకర్తలలో పాల్గొనడానికి నాగబాబుకు ఎలాంటి అర్హత ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కావడంతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొనబోతున్నారు.
ఇక నాగబాబు వారంలో ఐదు రోజుల పాటు పిఠాపురంలోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. పిఠాపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ బాధ్యతలను కూడా నాగబాబు చూసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. స్థానిక ఎన్నికల నాటికి పిఠాపురంలో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం కోసం నాగబాబు కృషి చేయబోతున్నారని తెలుస్తోంది.