Samantha – Naga Chaitanya: సమంత – నాగ చైతన్య.. 200 కోట్లు రిజెక్ట్ చేశారా?

చైతన్య-సమంత విడాకుల సంగతి అందరికి తెలిసిందే, కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియాలో మరోసారి ఇదే విషయంపై ఒక న్యూస్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రముఖంగా చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్ ప్రకారం.. సమంతకు విడాకుల సమయంలో నాగచైతన్య రూ.200 కోట్లు భారణంగా ఆఫర్ చేశాడట. కానీ సమంత ఈ మొత్తం తిప్పికొట్టేసిందట. ఇది ఎంత వరకు నిజం అనేది ఎవరికి తెలియదు. అయినా పూర్తిగా ఇది వారి వ్యక్తిగత జీవితం. అలాగే ఎప్పుడో పాత విషయాన్ని మళ్లీ బుల్లెట్లా దించడమే కాదు, ఎవరికీ సంబంధం లేని ఒక ప్రైవేట్ విషయాన్ని మరోసారి లైమ్‌లైట్‌లోకి లాగడమే ఆందోళనకరం.

ఈ విషయంపై ఆ సమయంలోనే సమంత చాలా క్లియర్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. “నా వైవాహిక జీవితం పూర్తయ్యింది. దయచేసి గౌరవించండి. నాపై వచ్చిన పుకార్లు నన్ను దిగొచ్చినట్టే ఉన్నాయి. కానీ నేనెప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు” అని చెప్పింది. అలాంటప్పుడు మళ్లీ ఈ అంశాన్ని తవ్వి, సోషల్ మీడియాలో హైలైట్ చేయడం ఏమాత్రం బాధ్యతాయుతమైన చర్య కాదు. పైగా ఇద్దరూ ఇప్పటికే తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోయారు. నాగచైతన్య శోభితతో మ్యారేజ్ చేసుకున్నాడు. సమంత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఇప్పుడు ఈ అలిమనీ వ్యవహారం గురించి ఎక్కడా అధికారికంగా వారు మాట్లాడలేదు. కనీసం సమంత స్వయంగా దీని గురించి మాట్లాడింది లేదు. నాగచైతన్య ఏమైనా ఆఫర్ చేశాడన్న దానిపై ఆధారాలు లేవు. అయినా ‘ఇండియా ఫస్ట్ సెలబ్రిటీ టు రీజెక్ట్ 200 కోర్ అలిమనీ’ అంటూ బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం… అందులోనే ఇంకొన్ని అనేక ఊహాగానాలు కలిపి రాసే తీరూ ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా తరచూ ఇతర భాషల నటీనటుల ప్రైవేట్ విషయాలను గాసిప్‌గా మార్చడం కొత్త విషయం కాదు.

ఇందుకు సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏవైనా బయటపెట్టిన వారు ఎవ్వరూ లేరు. ప్రస్తుతం వెబ్ సీరీస్ లు పలు సినిమాలతో సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు నాగచైతన్య కూడా తన నెక్స్ట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇద్దరూ తమ కెరీర్‌పై దృష్టి పెట్టారు. అలాంటప్పుడు పాత వ్యవహారాల్ని మళ్లీ తవ్వి, వ్యక్తిగత విషయాల్ని ప్రచారంగా మార్చడం సినీ సంస్కృతి పరంగా సరైనది కాదు.