Chiranjeevi: నాగబాబుకు ఎమ్మెల్సీ… మొదటిసారి రియాక్ట్ అయిన మెగాస్టార్ చిరు… ట్వీట్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి తన తమ్ముడు నాగబాబు ఎమ్మెల్సీ కావడం గురించి రియాక్ట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల ఏపీలో ఖాళీ అయినటువంటి ఐదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలకు మూడు పార్టీల నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు.

ఇలా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ నాగబాబుతో పాటు మిగిలిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఇక జనసేన పార్టీ నుంచి నాగబాబు ఎంపిక అవ్వడమే కాకుండా ఈయనను త్వరలోనే క్యాబినెట్లోకి మంత్రిగా ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటిసారి తన అన్నయ్య చిరంజీవి నాగబాబుకు ఎమ్మెల్సీ రావడం గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఎమ్మెల్సీగా ఎన్నికయి ఏపీ శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకు శుభాకాంక్షలు. ప్రజా సమస్యల మీద గళం విప్పాలని అన్నారు. వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడాలని.. ఆ కృషిలో విజయం సాధించాలని అన్నారు. వారి అభిమానాన్ని మరింత పొందాలని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇక త్వరలోనే నాగబాబు కూడా మంత్రిగా ఎంపిక కానున్నారు.

ఇక గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి కలిపి వేశారు అనంతరం ఈయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ రాజకీయాలలోకి వచ్చి మంత్రులు అయ్యారని చెప్పాలి.