Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి సరిగా 12 సంవత్సరాల అవుతుంది తాజాగా ఈయన తన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది జనసేన కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. ఇక జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా హాజరయ్యారు.
ఈ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 2014వ సంవత్సరంలో తాను ఈ పార్టీని స్థాపించానని తెలిపారు. ఓటమి అంటే భయం లేనటువంటి తాను పార్టీని నిలబెట్టడం కోసం ఎంతో పోరాటం చేస్తూ 2019 ఎన్నికలలో పోటీ చేశాము. అక్కడ ఓడిపోయిన ఏమాత్రం నిరాశ చెందకుండా తిరిగి 2024 లో కూడా పోటీ చేసే అద్భుతమైన విజయాన్ని సాధించామని తెలిపారు.
ఈ రాజకీయ ప్రయాణంలో తనని ఎంతోమంది ఎన్నో విధాలుగా అవమానపరిచారు తనని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ కొంతమంది చాలెంజ్ చేశారు. ఇప్పుడు వారికి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అంటూ పరోక్షంగా వైసిపిని ఉద్దేశించి పవన్ కౌంటర్లు వేశారు. ఓటమి చెందిన వెనకడుగు వేయకుండా మరో అడుగు ముందుకు వేస్తూ మేము నిలబడటమే కాకుండా మరొక పార్టీని కూడా నిలబెట్టాము అంటూ పవన్ మాట్లాడారు.
రాజకీయపరంగా జనసేన పార్టీ నిలదొక్కుకోవడమే కాకుండా 40 సంవత్సరాల చరిత్ర అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామని అలాగే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని నిలబెట్టాము అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి . పవన్ లేకపోతే టిడిపి పార్టీ ఉండేది కాదు అన్న ఉద్దేశంతో ఈయన మాట్లాడటం సమంజసం కాదు అంటూ తెలుగు తమ్ముళ్లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.