RC 16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా RC16 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేశాయి అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ తో ఒక పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టర్లో కూడా సినిమాకు పెద్ది అని టైటిల్ ఉండటంతో ఇది కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నారు అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఇటీవల చరణ్ గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు బుచ్చిబాబు సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో కూడా బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే.